Australia: రెండో వన్డేలో రన్ పూర్తి చేయని ధోనీ.. ఆసీస్ గమనించి ఉంటే మ్యాచ్ ఫలితం ఏమయ్యేదో?

  • పరుగు పూర్తి చేయని ధోనీ
  • గుర్తించలేకపోయిన అంపైర్, ఆసీస్ ఆటగాళ్లు
  • సోషల్ మీడియాలో వైరల్

ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా మాజీ సారథి ధోనీ మరోమారు మ్యాచ్ ఫినిషర్ అవతారం ఎత్తి జట్టును గెలిపించాడు. అయితే, ధోనీ గురించిన ఇంకో విషయం ఇప్పుడు సరికొత్త చర్చకు కారణమైంది. 45వ ఓవర్‌లో ధోనీ సింగిల్ తీస్తూ పరుగును పూర్తి చేయలేదు. క్రీజులోకి చేరుకోకుండానే మరో బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌తో మాట్లాడేందుకు వెళ్లాడు. ధోనీ పరుగు పూర్తిచేయకపోయినప్పటికీ అతడి ఖాతాలోకి పరుగు వచ్చి చేరింది.

తాజాగా, ధోనీ పరుగు పూర్తి చేయని వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఈ విషయాన్ని గమనించకపోవడంతోపాటు ఆసీస్ ఆటగాళ్లు కూడా ఈ విషయాన్ని గుర్తించలేదు. ఫలితంగా ధోనీ బతికిపోయాడు. ఒకవేళ ఆ తర్వాత అంపైర్ కానీ, ఆటగాళ్లు కానీ ఆ విషయాన్ని గ్రహించి ఉంటే భారత్ పరిస్థితి ఏమై ఉండేదన్న సందేహాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Australia
Team India
Adelaide
One-dady
MS Dhoni
Run
  • Loading...

More Telugu News