Deepika Padukone: పెళ్లయ్యాక... రణవీర్ కు మూడు కండిషన్స్ పెట్టిన దీపిక!

  • ఇంటికి ఆలస్యంగా రాకూడదు
  • ఫోన్ చేస్తే ఆన్సర్ చేయాల్సిందే
  • తన భార్య ఎంతో అందంగా కనిపిస్తుందన్న రణవీర్

దాదాపు ఆరేళ్ల పాటు లవ్ చేసుకున్న అనంతరం, ఇటీవలే ఇటలీలో రణవీర్‌ సింగ్, దీపికా పదుకొనే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తరువాత దీపిక తనకు మూడు కండిషన్స్ పెట్టిందని, ఓ తాజా ఇంటర్వ్యూలో రణవీర్ వెల్లడించాడు. ఇంటికి ఆలస్యంగా రాకూడదని, ఏమీ తినకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని, ఫోన్ కాల్ చేసినపుడు ఆన్సర్ చేయకుండా ఉండరాదని దీపిక నిబంధనలు విధించిందని చెప్పుకొచ్చాడు. ఇక తన భార్య నిద్రిస్తున్నా, మేల్కొన్నా తనకు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుందని, ఓ ఆదర్శ గృహిణిగా, తన జీవితాన్ని అందంగా, ఆనందంగా తీర్చి దిద్దుతుందన్న నమ్మకముందని అన్నాడు.

Deepika Padukone
Ranveer Singh
Interview
Marriage
  • Loading...

More Telugu News