Amit Shah: స్వైన్ ఫ్లూ బారినపడిన అమిత్ షా.. ఎయిమ్స్‌లో చేరిక

  • తనకు స్వైన్ ఫ్లూ సోకినట్టు స్వయంగా ట్వీట్
  • కొనసాగుతున్న చికిత్స
  • త్వరగా కోలుకోవాలంటూ స్మృతి ఆకాంక్ష

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర అస్వస్థతతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రాణాంతక స్వైన్ ఫ్లూ బారినపడిన ఆయనకు ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగుతున్నాయి. తాను స్వైన్ ఫ్లూ బారిన పడినట్టు అమిత్ షా బుధవారం సాయంత్రం స్వయంగా ట్వీట్ చేశారు. తనకు స్వైన్ ఫ్లూ వచ్చిందని, చికిత్స జరుగుతోందని పేర్కొన్న షా.. ఈశ్వరుడి దయతో, మీ అందరి ప్రేమాభిమానాలతో త్వరగానే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. అమిత్ షా త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆకాంక్షించారు.

Amit Shah
AIIMS
New Delhi
swine flue
BJP
  • Loading...

More Telugu News