Jagan: ఎన్నికలకు ముందు జగన్ ఘోర తప్పిదం: గంటా శ్రీనివాస్

  • కేసీఆర్-జగన్ అవిభక్త కవలలు
  • తలకిందులుగా తపస్సు చేసినా జగన్ సీఎం కాలేరు
  • వచ్చే ఎన్నికల్లో జగన్‌కు పరాభవం తప్పదు

సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అతిపెద్ద తప్పు చేశారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలుగు తల్లిని, ఏపీ సంస్కృతీ సంప్రదాయాలను కించపరిచిన కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని తప్పు చేశారన్నారు. కేసీఆర్-జగన్ అవిభక్త కవలలని అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

జగన్ తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీని, చంద్రబాబును ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీని ఒక్క మాటైనా అనే దమ్ము జగన్ కు లేదని విమర్శించారు. ఇన్నాళ్ల తెరచాటు రాజకీయాలకు ఇప్పుడు తెరపడిందన్న గంటా.. రానున్న ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. సెల్ఫ్ గోల్ చేసుకోవడం అలవాటైన జగన్ ఈసారి బయటపడే అవకాశమే లేదని మంత్రి పేర్కొన్నారు.  

Jagan
KCR
TRS
YSRCP
Telugudesam
Ganta Srinivasa Rao
  • Loading...

More Telugu News