ka paul: మార్చిలో మార్పులు.. ఏప్రిల్ లో సునామీ వస్తుంది: ఏపీ రాజకీయాలపై కేఏ పాల్

  • నన్ను కొనేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు
  • హెలికాప్టర్ తో ప్రచారానికి నిరాకరించారు
  • ఏపీకి కాబోయే సీఎం నేనే

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి తానేనని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి చెప్పారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని... జగన్ ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. రాష్ట్రంలో మార్చిలో మార్పులు వస్తాయని... ఏప్రిల్ లో ఏకంగా సునామీ వస్తుందని చెప్పారు. తన వెనుక ఎవరూ లేరని... దేవుడే తనను నడిపిస్తున్నాడని తెలిపారు.

తనను కొనేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని... రేవంత్ రెడ్డి మాదిరి తనను వలవేసి పట్టుకోవాలని చూస్తున్నారని కేఏ పాల్ అన్నారు. హెలికాప్టర్ తో ప్రచారానికి తనకు అనుమతి నిరాకరించారని... అందుకే ఇన్నోవా కార్లతోనే ప్రచారానికి వెళ్లానని చెప్పారు. జగన్ కోసం కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈనాటి భేటీతో టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీలు ఒకటనే విషయం తేలిపోయిందని చెప్పారు. తాను సీఎం అయిన తర్వాత కేసీఆర్ తో కలసి పని చేస్తానని తెలిపారు.

ka paul
Chandrababu
jagan
kct
KTR
praja shanthi party
tdy
ysrcp
TRS
  • Loading...

More Telugu News