Posani Krishna Murali: ఆడపడుచులను రోడ్డుపైకి లాగారంటూ చిరంజీవి కంటతడిపెట్టారు.. అందుకు నేనే సాక్ష్యం!: పోసాని

  • లక్ష్మీపార్వతిని చంద్రబాబు అన్ పాప్యులర్ చేశారు
  • చిరంజీవి ఇంట్లోని ఆడపడుచుల గురించి టీడీపీ నేతలు దారుణంగా మాట్లాడారు
  • టీడీపీ నేతలు ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారు

తన జీవితంలో చాలా కోరికలు కోరుకున్నానని... అన్నీ నీతివంతమైన కోరికలే అని సినీ నటుడు పోసాని కృష్ణమురళి చెప్పారు. ప్రస్తుతానికి వైసీపీ గెలవాలని, జగన్ సీఎం కావాలని మాత్రమే తాను న్యాయంగా కోరుకుంటున్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి మహిళలపై ఎంతమాత్రం గౌరవం లేదని విమర్శించారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని ఎంతో గౌరవంగా చూడాల్సి ఉన్నా... ఆ రోజుల్లోనే ఆమెను చంద్రబాబు అన్ పాప్యులర్ చేశారని చెప్పారు.

ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని... ఆ సమయంలో చిరంజీవి ఇంట్లో ఆడపడుచుల గురించి టీడీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడారో వీడియో క్లిప్పింగుల్లో చూడవచ్చని అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరంపరను కొనసాగిస్తున్నారని షర్మిళ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే, కుటుంబంలోని ఆడపడుచులను రోడ్డుపైకి లాగారంటూ చిరంజీవి చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారని... దానికి తానే సాక్ష్యమని చెప్పారు. గెలవడం కోసం కొందరు టీడీపీ నేతలు ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారని అన్నారు.

Posani Krishna Murali
Chiranjeevi
Chandrababu
Telugudesam
tollywood
jagan
ysrcp
prajarajyam
  • Loading...

More Telugu News