sharmila: షర్మిల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది: అంబటి

  • జగన్, కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై మాత్రమే చర్చించారు
  • టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు
  • కేసీఆర్ ను అమరావతికి చంద్రబాబు ఎందుకు పిలిచారు?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులా తాము ఎవరికీ కొమ్ముకాయమని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని చెప్పారు. కేసీఆర్ ను అమరావతికి చంద్రబాబు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. కేసీఆర్ యాగానికి చంద్రబాబు ఎందుకు వెళ్లారని అడిగారు. సీట్ల కోసం తాము పాకులాడమని అన్నారు. హరికృష్ణ శవాన్ని పక్కనపెట్టుకుని టీఆర్ఎస్ తో చంద్రబాబు చర్చలు జరిపింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తమ అధినేత జగన్ కేవలం ఫెడరల్ ఫ్రంట్ పైనే చర్చలు జరిపారని అంబటి తెలిపారు. టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. షర్మిల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. ఒక మహిళపై ఇలాంటి ప్రచారాలు చేయడం దారుణమని అన్నారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం చంద్రబాబు నైజమని విమర్శించారు.

sharmila
ambati
jagan
ysrcp
KTR
TRS
federal front
  • Loading...

More Telugu News