mumtaz ahmed khan: తెలంగాణ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేసిన ముంతాజ్ అహ్మద్ ఖాన్

  • రేపటి నుంచి ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ
  • ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించనున్న ప్రొటెం స్పీకర్
  • స్పీకర్ పదవి కోసం ఇద్దరు, ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్న కేసీఆర్

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేత గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రేపు ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించిన తర్వాత పూర్తి స్థాయి స్పీకర్ ను ఎంపిక చేస్తారు. స్పీకర్ పదవి కోసం ఇద్దరు, ముగ్గురు పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేరును ఆయన ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

mumtaz ahmed khan
protem speaker
telangana
kcr
Asaduddin Owaisi
narasimhan
governor
  • Loading...

More Telugu News