jagan: ముగ్గురు మోదీల డ్రామా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తోంది: ఏపీ మంత్రి నారాయణ

  • చంద్రబాబు చెప్పిందే జరుగుతోంది
  • జగన్, కేటీఆర్ ల భేటీతో విషయం బట్టబయలైంది
  • మోదీని పీఎం చేసేందుకే కేసీఆర్ మూడో ఫ్రంట్ ను తెరపైకి తెస్తున్నారు

వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీపై ఏపీ మంత్రి నారాయణ స్పందించారు. ఇంతవరకు తెరవెనుక ఉన్న కుట్ర... ఇప్పుడిప్పుడే బయటకు వస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పిందే జరుగుతోందని అన్నారు. జగన్, కేటీఆర్ ల మధ్య చర్చలతో ఆ విషయం బట్టబయలైందని చెప్పారు.

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీని వదిలేసి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న చంద్రబాబుపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం మోదీతో జగన్ లాలూచి పడ్డారని ఆరోపించారు. బీజేపీ లేని కేంద్ర ప్రభుత్వం ఏర్పడితేనే ఏపీకి మంచి జరుగుతుందని అన్నారు. మోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకే కేసీఆర్ మూడో ఫ్రంట్ ను తెర మీదకు తెస్తున్నారని చెప్పారు. ముగ్గురు మోదీల డ్రామా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తోందని ఎద్దేవా చేశారు.

jagan
YSRCP
KTR
kcr
TRS
chandrababu
narayana
Telugudesam
modi
bjp
federal front
  • Loading...

More Telugu News