cat murder: పెంపుడు పిల్లిని చంపిన పొరుగింటి వ్యక్తిపై కేసు నమోదు

  • థానే నగరంలో ఘటన
  • ఇటీవలే మూడు పిల్లలకు జన్మనిచ్చిన పిల్లి
  • యజమాని ఫిర్యాదుతో కేసు

పెంపుడు పిల్లిని కర్రతో కొట్టి చంపిన వ్యక్తిపై మహారాష్ట్రలోని థానే పోలీసులు కేసు నమోదు చేశారు. థానే నగరంలోని బృందావన్‌ సొసైటీకి చెందిన నీలేష్‌ మోహన్‌ మాలవీయ (44) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. సొసైటీ పరిధిలో కొన్నాళ్ల క్రితం ఓ పిల్లి అతనికి కనబడింది. దాన్ని తెచ్చుకుని మాలవీయ కుటుంబం పెంచుకుంటున్నారు. ఇటీవలే ఆ పిల్లి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, పిల్లి బయటకు వచ్చి తన ఇంటి ముందు తచ్చాడుతోందన్న కోపంతో పొరుగునే నివసిస్తున్న మరో వ్యక్తి దాన్ని కర్రతో కొట్టి చంపేశాడు. కాసేపటికి చచ్చిపడివున్న పిల్లిని చూసిన నీలేష్‌ దంపతులు అందుకు కారకుడు పక్కింటి వ్యక్తేనని అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 429 సెక్షన్‌ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

cat murder
case filed
mumbai
thane
  • Loading...

More Telugu News