Sasitharoor: పద్మనాభ స్వామి దర్శనానికి శశిథరూర్ కు అనుమతి నిరాకరణ!

  • ఆలయానికి మోదీతో పాటు వెళ్లిన శశిథరూర్
  • లోపలికి అనుమతించని అధికారులు
  • బీజేపీ కుటిల రాజకీయమని ఆగ్రహం

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శశిథరూర్ కు తిరువనంతపురంలోని ప్రముఖ దేవాలయమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అవమానం ఎదురైంది. ఆయన్ను ఆలయంలోకి అనుమతించలేదు. 'స్వదేశీ దర్శన్' ప్రాజెక్టులో భాగంగా ఓ పర్యాటక కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, ఆలయాన్ని సందర్శించిన వేళ ఈ ఘటన జరిగింది.

తన పర్యటన అనంతరం మోదీ పద్మనాభుని దర్శనానికి వెళ్లగా, ఆయనతో పాటు శశిథరూర్ కూడా వెళ్లారు. అయితే, ఆయన్ను ఆలయంలోకి అనుమతించేది లేదని అక్కడి అధికారులు చెప్పడంపై శశిథరూర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావాలనే పీఎంఓ తనతో పాటు మరికొందరి పేర్లను తొలగించిందని ఆయన ఆరోపించారు. కుటిల రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలని ఆయన ట్వీట్ చేశారు.

Sasitharoor
Kerala
Tiruvanantapuram
Padmanabhaswami
  • Loading...

More Telugu News