Arun Jaitly: కేన్సర్ తో బాధ పడుతున్న అరుణ్ జైట్లీ?

  • వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన అరుణ్ జైట్లీ
  • కిడ్నీ సమస్యే కారణమని అందరి భావన
  • కేన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లారంటూ ది వైర్ కథనం

వైద్య చికిత్స కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. కిడ్నీ సమస్య కారణంగానే ఆయన అమెరికా వెళ్లినట్టు అందరూ భావించారు. కానీ ఆయన కేన్సర్ తో బాధపడుతున్నారంటూ 'ది వైర్' వెబ్ సైట్ ప్రకటించింది. ఆయన తొడపై సున్నితమైన కేన్సర్ టిష్యూ ఉందని... అది శరీరంలోని ఇతర భాగాలకు సోకే అవకాశం ఉందని... అందుకు చికిత్స కోసం జైట్లీ అమెరికాకు వెళ్లారని తెలిపింది.

మరోవైపు గత ఏడాదే జైట్లీ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. మరోవైపు రెండు వారాల పాటు లీవుపై వెళ్తున్నట్టు జైట్లీ అధికారికంగా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వారాల్లో ఆయన తిరిగి రాలేరని చెబుతున్నారు. ఇదే జరిగితే ఫిబ్రవరి 1న ఆయన స్థానంలో మరొకరు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. 

Arun Jaitly
america
cancer
  • Loading...

More Telugu News