Sabarimala: పంబ దాటి నీలిమల వరకూ వెళ్లిన ఇద్దరు మహిళలు... శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత!

  • స్వామిని చూసేందుకు వచ్చిన ఇద్దరు మహిళలు
  • అడ్డుకున్న అయ్యప్ప భక్తులు
  • సురక్షిత స్థానానికి చేర్చిన పోలీసులు

మరో ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వచ్చిన వేళ, మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పంబను దాటి ట్రెక్కింగ్ మొదలు పెట్టిన వీరిని, నీలిమల వద్ద భక్తులు అడ్డుకున్నారు. మహిళలను రానిచ్చేది లేదని తేల్చి చెబుతూ, శరణు ఘోష చెబుతూ నిరసన వ్యక్తం చేశారు.

దీనికి స్పందించిన పోలీసులు, ఈ ఇద్దరు మహిళలను వెంటనే కిందకు తీసుకెళ్లి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు. కాగా, ఆలయాన్ని ఏ వయసు మహిళైనా దర్శించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత, గత నెలలో ఇద్దరు మహిళలు స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ సుమారు 10 మంది మహిళలు స్వామిని దర్శించారని కేరళ ప్రభుత్వం చెబుతుండగా, ఇద్దరు మాత్రమే దర్శించుకున్నారని, ఆపై ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించామని ఆలయ వర్గాలు అంటున్నాయి.

Sabarimala
Ayyappa
Ladies
Pamba
Neelimala
  • Loading...

More Telugu News