Singapore Airlines: అదృష్ట పక్షి... విమానంలో సింగపూర్ నుంచి లండన్ కు ప్రయాణం... వీడియో వైరల్!

  • సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో పక్షి
  • లండన్ వరకూ ప్రయాణం
  • వైరల్ అవుతున్న వీడియో

విమాన ప్రయాణమే చాలా మందికి నెరవేరని కల. ఇక అది కూడా బిజినెస్ క్లాసులో అంటే... ఇంకేముంది... ఫ్రీగా బిజినెస్ క్లాసులో వెళ్లాలంటే ఎంత అదృష్టమో ఉండాలి. ఈ పక్షికి అంత అదృష్టమే పట్టుకుంది. సింగపూర్ నుంచి లండన్ వరకూ 14 గంటల పాటు రూపాయి ఖర్చు లేకుండా, బిజినెస్ క్లాస్ లో కూర్చుని వెళ్లిపోయింది. ఈ ఘటన సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో జరిగింది.

విమానంలోకి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదుగానీ, దేశదేశాలు దాటి వెళ్లిపోయింది. సింగపూర్ ఎయిర్ లైన్స్ అధికారులు సైతం దీనిపై స్పందించారు. ఈ ఘటన 7వ తేదీన జరిగిందని, ఆ పక్షి లోపలికి ఎలా వచ్చిందో తెలియదని, కాస్తంత కష్టపడి దాన్ని పట్టుకుని, లండన్ లోని జంతు సంరక్షణ అధికారులకు అప్పగించామని వెల్లడించింది. ఇక పక్షిని విమానంలో చూసిన పలువురు దాన్ని వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవన్నీ వైరల్ అవుతుండగా, ఆ పక్షి అదృష్ట పక్షని కామెంట్లు వస్తున్నాయి.

Singapore Airlines
Bird
London
Business Class
Journey
  • Error fetching data: Network response was not ok

More Telugu News