Bihar: చదువు సంధ్యలు లేని వాళ్లే ఎక్కువ మందిని కంటారు: సుశీల్ మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు

  • అక్షరాస్యులకు సంతానంపై అవగాహన ఉంటుంది
  • అది లేకే ఎక్కువ మందిని కంటున్నారు
  • 2024 నాటికి చైనాను దాటేస్తాం

చదువు సంధ్యలు లేని నిరక్షరాస్యులే ఎక్కువమంది పిల్లల్ని కంటారని బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలను అక్షరాస్యులుగా మార్చడం ద్వారా మాత్రమే జనాభా నియంత్రణకు అడ్డుకట్ట వేయగలమన్న ఆయన ఇందుకోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అక్షరాస్యతతో అన్ని సమస్యలను పరిష్కరించవచ్చన్నారు.

చదువుకున్న వారికి సంతానంపై అవగాహన ఉంటుందని, అది లేనివారే ఎక్కువమంది పిల్లల్ని కంటారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే జనాభాలో భారతదేశం రెండో స్థానంలో ఉందని, 2024 నాటికి మన దేశం ఈ విషయంలో చైనాను మించిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి జనాభా నియంత్రణ విషయంలో ప్రతి ఒక్కరిని చైతన్యవంతుల్ని చేయాలని, అది అక్షరాస్యత ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని సుశీల్ కుమార్ మోదీ అన్నారు.

  • Loading...

More Telugu News