Brexit Deal: బ్రిటన్ ప్రధానికి పార్లమెంటులో ఎదురుదెబ్బ.. బ్రెగ్జిట్‌పై ఓటింగ్‌లో థెరిస్సా ఓటమి
- బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 432, అనుకూలంగా 202 ఓట్లు
- ప్రధానిపై అవిశ్వాస తీర్మానం
- ప్రవేశపెట్టిన ప్రతిపక్ష లేబర్ పార్టీ
బ్రెగ్జిట్‌పై బ్రిటన్ పార్లమెంటులో నిర్వహించిన చారిత్రక ఓటింగ్‌లో ఆ దేశ ప్రధాని థెరిస్సా మే ఓటమి పాలయ్యారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ నిర్ణయం (దీనినే సంక్షిప్తంగా 'బ్రెగ్జిట్' అంటారు) పై పార్లమెంటులో చారిత్రక ఓటింగ్ నిర్వహించారు. ఇందులో బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 432 మంది, అనుకూలంగా 202 మంది ఓటేశారు.
బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేయాలన్న ప్రధాని అభ్యర్థనను సభ్యులు పట్టించుకోలేదు. ఫలితంగా థెరిస్సా మే ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రధానిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం కనుక నెగ్గితే, మెజారీ పార్టీ ఆ తర్వాత విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు రెండు వారాల గడువు ఉంటుంది. నిర్దేశిత గడువులోపు విశ్వాస తీర్మానంలో నెగ్గలేకపోతే బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తారు.