mayavathi: మాయావతి బర్త్ డే.. కేకు కోసం ఎగబడిన జనాలు.. క్షణాల్లోనే లూటీ!

  • ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు
  • అమ్రోరా వేడుకల్లో పార్టీ నేతలకు జనాల షాక్
  • కేకు ముక్క కోసం తోపులాట

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి జన్మదినం సందర్భంగా ఆ రాష్ట్రంలోని అమ్రోరాలో జరిగిన వేడుకల దృశ్యాలు వైరల్ అయ్యాయి. కేకు కట్ చేసిన తర్వాత దాని కోసం జనాలు ఎగబడ్డారు. కేకు ముక్కను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. దానిమీద పడి అందినకాడికి లాక్కున్నారు. అక్కడే ఉన్న పార్టీ నేతలు వారిస్తున్నా, అరిచి గీపెట్టినా పట్టించుకోలేదు. ఎవరికి వారు చేతులతో కేకును లాక్కోవడంతో అదికాస్తా చితికిపోయింది. అయినప్పటికీ వదల్లేదు. క్షణాల్లోనే లూటీ చేసి జారుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, మాయావతి 63వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించాయి.  

mayavathi
Uttar Pradesh
birth day
Cake
BSP
  • Error fetching data: Network response was not ok

More Telugu News