YSRCP: నేడు జగన్‌తో కేటీఆర్ భేటీ.. సర్వత్ర ఆసక్తి!

  • హైదరాబాద్‌లో నేడు కేటీఆర్ బృందంతో జగన్ భేటీ
  • కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై జగన్ ఆసక్తి
  • చర్చల్లో వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో నేడు కేటీఆర్ బృందం చర్చలు జరపనుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ బృందం జగన్‌తో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తమతో కలిసి రావాలని జగన్‌ను కేటీఆర్ కోరే అవకాశం ఉంది. నేడు హైదరాబాద్‌లో జరగనున్న ఈ చర్చల్లో కేటీఆర్, వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు.

కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిపై జగన్‌ కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఎన్నికల్లోపు ఫెడరల్ ఫ్రంట్‌కు ఓ రూపం తేవాలని భావిస్తున్న కేసీఆర్.. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,  ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో చర్చలు జరిపారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల నాటి నుంచి చంద్రబాబుపై ఆగ్రహం పెంచుకున్న కేసీఆర్.. జగన్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఫెడరల్ ఫ్రంట్‌లో చేరేందుకు మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

YSRCP
Jagan
TRS
KCR
federal front
Chandrababu
KTR
  • Loading...

More Telugu News