smrithi irani: త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి.. ఫొటోను షేర్ చేసిన స్మృతి ఇరానీ!
- కుంభమేళా తొలి రోజున ప్రయాగ్ రాజ్ కు పోటెత్తిన భక్తులు
- గంగా, యమున, సరస్వతిల సంగమం హిందువులకు అత్యంత పవిత్రం
- పాపాలు పోతాయని, సమస్యలు తీరుతాయని నమ్మకం
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కుంభమేళా ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో ఉన్న పవిత్ర త్రివేణి సంగమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పవిత్ర స్నానమాచరించారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో ఆమె పంచుకున్నారు. 'హర హర గంగా' అంటూ క్యాప్షన్ పెట్టారు.
మరోవైపు కుంభమేళా తొలి రోజున లక్షలాది మంది భక్తులు గంగా సంగమంలో స్నానమాచరించారు. ఈ సంగమంలో గంగా, యమున, అంతర్వాహిని అయిన సరస్వతి నదులు కలుస్తాయి. ఈ కారణంగానే ఈ సంగమాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. పవిత్ర స్నానమాచరిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని, సమస్యలు పరిష్కారమవుతాయనేది హిందువుల నమ్మకం.