Jagan: మేము చెప్పిన విషయాన్ని పవన్ కూడా ఒప్పుకున్నారు: చంద్రబాబు

  • కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారు
  • కుమ్మక్కు రాజకీయాన్ని తిప్పికొడతాం
  • టీడీపీ ఏకపక్ష విజయం ఖాయం

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో వైసీపీ అధినేత కుమ్మక్కయ్యారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారని.. చివరికి తాము చెప్పిన విషయాన్ని పవన్ కూడా అంగీకరించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి కుమ్మక్కు రాజకీయాన్ని తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించడం ఖాయమన్నారు. ఏపీలో ఉంటూ.. పార్టీ నడుపుతూ.. ఏపీ వ్యవస్థపై నమ్మకం లేదనడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఏం చేయాలో జనమే చూసుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News