Narendra Modi: జగన్‌, షర్మిల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: చంద్రబాబు

  • టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించబోతోంది
  • జనం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు
  • ఎన్ఐఏకు అప్పగించడంపై కోర్టుకు వెళతాం

మోదీ, కేసీఆర్, జగన్ ఏకమైనా ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించబోతోందని.. జనం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. జగన్, షర్మిల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు.

ఏపీ పోలీసులపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఇక్కడి పోలీసులపై నమ్మకం లేని వీరు రాష్ట్ర పౌరులుగా ఎలా ఉంటారని... ఏపీలో ఎలా పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. విశాఖలో జగన్‌పై జరిగిన దాడిపై హైదరాబాద్ వెళ్లి ఎన్ఐఏ విచారణ కావాలంటున్నారని పేర్కొన్నారు. కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కోర్టుకు వెళతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Narendra Modi
Jagan
Sharmila
Chandrababu
KCR
YSRCP
  • Loading...

More Telugu News