Visakhapatnam District: కూతురుని వేధిస్తున్న అల్లుడిని కత్తితో పొడిచిన మామ

  • భార్యను వేధిస్తున్న అల్లుడితో మామ గొడవ
  • ఆవేశంలో అల్లుడిని కత్తితో పొడిచిన మామ
  • ఆసుపత్రిలో కోలుకుంటున్న అల్లుడు

తన కూతురును వేధిస్తున్న అల్లుడిని మామ కత్తితో పొడిచిన ఘటన విశాఖపట్నం జిల్లా పాకాల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇరంగారిపల్లె పంచాయతీ తలారిపల్లెకు చెందిన మణి అనే వ్యక్తి కూతురు లక్ష్మిదేవికీ, అదే గ్రామానికి చెందిన నరేష్ కు కొంత కాలం క్రితం వివాహం జరిగింది.

కొంత కాలం బాగానే ఉన్న నరేష్... ఆ తర్వాత లక్ష్మిదేవిని తరచూ వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో నరేష్ కు, మణికి మధ్య నిన్న గొడవైంది. ఈ క్రమంలో ఆవేశంలో అల్లుడిని కత్తితో మణి పొడిచేశాడు. తీవ్రంగా గాయపడ్డ నరేష్ కు పాకాల ఆసుపత్రిలో ప్రథమ చికిత్స జరిపించి...ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. మరోవైపు, మణిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Visakhapatnam District
murder
attempt
daughter
son in law
father in law
  • Loading...

More Telugu News