Andhra Pradesh: కోడి పందేల ఎఫెక్ట్.. కృష్ణాజిల్లాలో గుండెపోటుతో వ్యక్తి మృతి!

  • కృష్ణా జిల్లాలోని కొడవటికల్లులో ఘటన
  • రూ.5 వేలు పందెం కట్టిన రవి
  • ఒత్తిడికి లోనయి గుండెపోటుతో దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. కోడి పందేలపై బెట్టింగ్ పెట్టిన ఓ వ్యక్తి ఒక్కసారిగా ఒత్తిడికి లోనై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడి కొడవటికల్లు ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో నందిగామ ప్రాంతానికి చెందిన భట్టిప్రోలు రవి ఇక్కడకు వచ్చాడు. ఓ కోడి పుంజుపై రూ.5,000  పందెం కట్టాడు. పోటీ జోరుగా సాగుతుండగా రవి గుండెలు పట్టుకుని కుప్పకూలిపోయాడు. ఆయన్ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Andhra Pradesh
Krishna District
sankranti
chiocken fight
heart attack
dead
betting
  • Loading...

More Telugu News