Cricket: హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. గౌరవ సభ్యత్వాన్ని రద్దుచేసిన జింఖానా క్లబ్!

  • మహిళలపై హార్దిక్, రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు
  • ఇద్దరిని జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ
  • జిలెట్ ఎండార్స్ మెంట్ కోల్పోయిన హార్దిక్

‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో అమ్మాయిలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ భారత జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. పాండ్యాకు గతంలో ఇచ్చిన గౌరవ సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ముంబైకు చెందిన ప్రఖ్యాత జింఖానా స్పోర్ట్స్ క్లబ్ ప్రకటించింది.

ఈ వ్యవహారంలో ఇద్దరు ఆటగాళ్లకు ఇప్పటికే బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీచేసింది. దీంతో పాండ్యా, రాహుల్ క్షమాపణలు కోరుతూ జవాబిచ్చారు. కీలకమైన 2019 ప్రపంచకప్ కు ఐదు నెలల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో నోటి దురుసుతో పాండ్యా ఇప్పటికే ప్రముఖ కంపెనీ ‘జిలెట్’ ఎండార్స్ మెంట్ ను కోల్పోయాడు.

Cricket
hardhik pandya
kl rahul
controversy
women
comments
gymkhana
honorary-membership
revoked
  • Loading...

More Telugu News