Kerala: శబరిమలకు వెళ్లినందుకు దుర్గపై అత్త దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు!

  • కేరళలోని తిరువనంతపురంలో ఘటన
  • అజ్ఞాతం నుంచి ఇంటికి వచ్చిన దుర్గ
  • గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన మహిళ

శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకుని ఇంటికి వచ్చిన కనకదుర్గపై ఈరోజు అత్త దాడిచేసిన సంగతి తెలిసిందే. హిందూ సంఘాల హెచ్చరికలతో 2 వారాల పాటు అజ్ఞాతంలో గడిపిన కనకదుర్గ తిరువనంతపురంలో ఉన్న తన ఇంటికి తెల్లవారుజామున చేరుకోగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కనకదుర్గను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

తాజాగా కోడలిపై దాడి చేసినందుకు సదరు అత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. కనకదుర్గపై దాడి ఘటన మీడియాలో వైరల్ గా మారడంతో ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 2న కనకదుర్గ, బిందు అనే మరో మహిళతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమలలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని 2018, సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

Kerala
sabarimala
mother in law attack
Police
case
tiruvanathapuram
kanakadurga
  • Loading...

More Telugu News