Andhra Pradesh: ఈ సంక్రాంతి పండుగ నవ్యాంధ్రకు నవక్రాంతి కావాలని కోరుకుంటున్నా!: చంద్రబాబు

  • తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
  • ఇంటికి పెద్ద కొడుకుగా పెన్షన్లు రెట్టింపు చేశా 
  • నిరుపేదల కళ్లలో సంతోషం సంతృప్తి ఇస్తోందని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ నవ్యాంధ్రప్రదేశ్ కు నవ క్రాంతి కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘‘నిరుపేదల కళ్లలో వెలుగు చూడటమే నాకు నిజమైన సంక్రాంతి. ఈ సంక్రాంతి నవ్యాంధ్రప్రదేశ్‌కు నవ క్రాంతి అవ్వాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ 'మకర సంక్రాంతి' శుభాకాంక్షలు. పెన్షన్లను రెట్టింపు చేసి ఇంటికి పెద్దకొడుకుగా సంక్రాంతి కానుక ఇవ్వడం నాకెంతో సంతృప్తినిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Chief Minister
sankranti
wishes
  • Loading...

More Telugu News