New Delhi: రూ. 150 కోసం తండ్రిని పొడిచి చంపిన బాలుడు!

  • కుమారుడికి డబ్బులు ఇచ్చేందుకు తండ్రి నిరాకరణ
  • ఆగ్రహంతో కత్తితో పొడిచిన బాలుడు
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

తాను అడిగితే రూ. 150 ఇవ్వనన్నాడని కన్న తండ్రినే అత్యంత దారుణంగా పొడిచి చంపాడో బాలుడు. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్‌లో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకారం.. 17 ఏళ్ల బాలుడు తన తండ్రి హజారీ ముఖియా (42)ను రూ. 150 కావాలని అడిగాడు. తండ్రి తన వద్ద డబ్బులు లేవంటూ ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయినప్పటికీ డబ్బులు ఇచ్చేందుకు తండ్రి నిరాకరించడంతో కుమారుడు ఆగ్రహం పట్టలేకపోయాడు.  

కత్తితో తండ్రిపై దాడిచేసి పలుమార్లు విచక్షణ రహితంగా పొడిచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన భర్తను అతడి భార్య వెంటనే ఆసుపత్రికి తరలించింది. అయితే, మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు.

New Delhi
New ashok nagar
Stabbed
son
Father
Crime News
  • Loading...

More Telugu News