Ravi Shankar Prasad: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక

  • శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న మంత్రి
  • రాత్రి 8 గంటలకు ఆసుపత్రిలో చేరిక
  • వైద్యుల పర్యవేక్షణలో రవిశంకర్ ప్రసాద్

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన పల్మనరీ మెడిసిన్ విభాగంలో చేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన పూర్తిస్థాయిలో చికిత్స కోసమే ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్నారు. అయితే, ఇంతకుమించిన వివరాలు తెలియరాలేదు.

Ravi Shankar Prasad
AIIMS
Law and Justice
pulmonary
New Delhi
  • Loading...

More Telugu News