shoban babu: శోభన్ బాబుతో నా అనుబంధం గురించి మాటల్లో చెప్పలేను: సినీ నటుడు కృష్ణంరాజు

  • నా మనసులో ఆయనెప్పుడూ ఉంటాడు
  • మా నాన్న పుట్టినరోజు, శోభన్ బాబు బర్త్ డే ఒకే రోజు
  • డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడన్న మాట పచ్చి అబద్ధం

ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు పేరిట ఇచ్చే జీవితకాల సాఫల్య పురస్కారాన్ని సీనియర్ నటుడు కృష్ణంరాజు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'శోభన్ బాబుతో నాకున్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేను కానీ, నా మనసులో ఆయన ఎప్పుడూ ఉంటాడు' అంటూ తమ ఆత్మీయతను చాటుకున్నారు.

"జనవరి 14 వస్తే, పొద్దున్నే ఆరుగంటలకు శోభన్ బాబుకు ఫోన్ చేసి.. ‘జన్మదిన శుభాకాంక్షలు రా’ అని అనే వాడిని. నీకు ఎలా జ్ఞాపకం ఉంటుందిరా?’ అని అనేవాడు. నీ బర్త్ డే.. మా ఫాదర్ బర్త్ డే.. ఒకటే రోజు’ అని చెప్పేవాడినని గుర్తుచేసుకున్నారు. ‘శోభన్ బాబు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడన్న మాట పచ్చి అబద్ధం. అనవసరంగా ఖర్చు పెట్టడు, దానం చేయడు అనవసరంగా, మాటలెక్కువ చెప్పడు అనవసరంగా. అంతా క్యాలిక్యులేటెడే’ అని చెప్పారు. 

shoban babu
krishnam raju
awards
  • Error fetching data: Network response was not ok

More Telugu News