YSRCP: మహిళలను కించపర్చే సంస్కృతి వైసీపీదే!: పరిటాల సునీత విమర్శలు

  • మహిళా ఎమ్మెల్యేలనూ కంట తడిపెట్టించిన వ్యక్తి జగన్
  • ఏ మహిళపైనా ఇలాంటి దుష్ప్రచారం తగదు
  • మహిళలను తోబుట్టువులుగా భావించే పార్టీ టీడీపీ

సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి కారణం టీడీపీయేనంటూ వైఎస్ షర్మిళ చేసిన ఆరోపణలను ఏపీ మంత్రి పరిటాల సునీత ఖండించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, మహిళలను కించపర్చే సంస్కృతి వైసీపీదేనని, మహిళా ఎమ్మెల్యేలను సైతం కంట తడిపెట్టించిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.

మహిళా ఐఏఎస్ అధికారిణులను, మంత్రులను జైలుపాలు చేసిన చరిత్ర జగన్ దని ఆరోపించారు. ఇలాంటి దుష్ప్రచారాలకు సోషల్ మీడియాను వేదికగా చేసిన ఘనత జగన్ దేనని ధ్వజమెత్తారు. మహిళలను తమ తోబుట్టువులుగా భావించే పార్టీ టీడీపీ అని కొనియాడారు. షర్మిళతో పాటు ఏ మహిళపై ఇలాంటి దుష్ప్రచారం జరిగినా తాము తీవ్రంగా ఖండిస్తామని స్పష్టం చేశారు.

YSRCP
jagan
Telugudesam
paritala sunitha
  • Loading...

More Telugu News