allu sirish: 'ఏబీసీడీ'పైనే అల్లు శిరీశ్ ఆశలు

- మలయాళంలో హిట్ కొట్టిన 'ఏబీసీడీ'
- తెలుగులో రీమేక్ చేస్తోన్న సంజీవ్ రెడ్డి
- మార్చి 1వ తేదీన విడుదల
అల్లు శిరీశ్ కథానాయకుడిగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 'ఏబీసీడీ' సినిమా రూపొందింది. మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన 'ఏబీసీడీ' సినిమాకి ఇది రీమేక్. మలయాళ సినిమా మంచి వసూళ్లను సాధించి విజయాన్ని అందుకుంది. దుల్కర్ కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అయింది కూడా.
