talasani: ఏపీలో కుల రాజకీయాలు పెరగడానికి చంద్రబాబే కారణం: తలసాని

  • చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
  • ఏపీ ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు
  • ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతిస్తుంది

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పామని... అందులో అనుమానమే లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తామే కాకుండా ఏపీ ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చెప్పారు. చంద్రబాబు కేవలం ప్రచారాలకే పరిమితమయ్యారని... ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ కావడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు కుల రాజకీయం చేశారని చెప్పారు.

ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని తలసాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో చంద్రబాబు డ్రామాలాడారని.... తామెందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మాట్లాడిన వారిని చంద్రబాబు జైల్లో పెట్టించారని విమర్శించారు. ఏపీలో తాము ఏ పార్టీకి మద్దతిస్తామనే విషయం తాము ఇంకా ప్రకటించలేదని చెప్పారు.

talasani
Chandrababu
return gift
TRS Telugudesam
  • Loading...

More Telugu News