NTR: నాకు తెరపై కనిపించింది బాలకృష్ణ కాదు ఎన్టీఆర్: ‘కథానాయకుడు’పై హీరో రాజశేఖర్

  • బాలకృష్ణ చాలా అద్భుతంగా నటించారు
  • బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ నటన అమోఘం
  • ఈ సినిమాను దయచేసి ఎవ్వరూ మిస్సవకండి

యన్.టి.ఆర్’ తొలి భాగం ‘కథానాయకుడు’పై ఇప్పటికే టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా, ఈ చిత్రంపై హీరో రాజశేఖర్ స్పందించారు. తన కుటుంబంతో కలిసి ‘కథానాయకుడు’ని చూశామని, ఈ సినిమా పూర్తయ్యేవరకు తనకు తెరపై కనిపించింది బాలకృష్ణ కాదు ఎన్టీఆర్ అంటూ బాలయ్యను ప్రశంసించారు.

బాలకృష్ణ చాలా అద్భుతంగా నటించారని, అలాగే, బసవతారకం పాత్రలో విద్యాబాలన్, నందమూరి హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్, నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, చంద్రబాబు పాత్రల్లో రానాలు అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతిఒక్కరూ  ప్రశంసలకు అర్హులేనని, తనకు, తన భార్య జీవితకు ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, దయచేసి ఎవ్వరూ మిస్సవకండి అని రాజశేఖర్ పేర్కొన్నారు.

NTR
Kathanayakudu
Hero
Rajashekar
  • Loading...

More Telugu News