YSRCP: షర్మిళపై ప్రచారానికి, టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు: బుద్ధా వెంకన్న

  • వ్యక్తిగత ఆరోపణలను చంద్రబాబు ప్రోత్సహించరు
  • షర్మిళ ప్రస్తావన మేమెప్పుడూ తీసుకురాలేదు
  • వ్యక్తిగత ఆరోపణలెవరు చేసినా ఖండించాల్సిందే

వైసీపీ నాయకురాలు షర్మిళపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, షర్మిళపై సోషల్ మీడియా ప్రచారానికి, టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒకరిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తమ అధినేత చంద్రబాబు ప్రోత్సహించరని స్పష్టం చేశారు. జగన్ ను రాజకీయంగా విమర్శించామే తప్ప, షర్మిళ ప్రస్తావన తామెప్పుడూ తీసుకురాలేదని చెప్పారు. వ్యక్తిగత ఆరోపణలు ఏ పార్టీ వాళ్లు చేసినా ఖండించాల్సిందేనని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

YSRCP
jagan
sharmila
buddha venkanna
  • Loading...

More Telugu News