sharmila: గతంలో కూడా జగన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.. సమాజానికి మంచిది కాదు: ఏపీ పోలీసులు

  • ఏదైనా ఉంటే రాజకీయపరమైన విమర్శలు చేసుకోవాలి
  • పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యానించడం దారుణం
  • పోలీసు శాఖకు వైయస్ ఎన్నో కితాబులు ఇచ్చారు

ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళ చేసిన వ్యాఖ్యలను ఆంధ్ర పోలీసులు ఖండించారు. ఏపీ పోలీసు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, గతంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలను జగన్ చేశారని... ఆయన వ్యాఖ్యలను కూడా అప్పట్లో తాము ఖండించామని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో పోలీసులపై అపనమ్మకం ఏర్పడుతుందని... ఇది సమాజానికి మంచిది కాదని చెప్పారు. పార్టీలకు సంబంధించి ఏదైనా ఉంటే రాజకీయపరమైన విమర్శలు చేసుకోవాలని... పోలీసులను కించపరిచేలా మాట్లాడటం మాత్రం దారుణమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను రాష్ట్ర పోలీసు సంఘం ఒప్పుకోదని స్పష్టం చేశారు.

దివంగత రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా తమపై ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదని శ్రీనివాస్ చెప్పారు. పోలీసు శాఖకు వైయస్ ఎన్నో కితాబులు ఇచ్చారని తెలిపారు. చట్టాలు, ప్రభుత్వ నిబంధనల మేరకు పోలీసు వ్యవస్థ పని చేస్తుందని... భవిష్యత్తులో వీరి ప్రభుత్వం ఏర్పడినా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. తమకు ఏ పార్టీతో సంబంధం ఉండదని తెలిపారు.

sharmila
jagan
ys rajasekhara reddy
YSRCP
ap police
  • Loading...

More Telugu News