talasani: భీమవరంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న టీఆర్ఎస్ నేతలు తలసాని, మాధవరం

  • ఏపీ వ్యాప్తంగా మొదలైన సంక్రాంతి సంబరాలు
  • రాత్రికి భీమవరంలో బస చేయనున్న తలసాని
  • రేపు సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న మాజీ మంత్రి

ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడిపందేల హడావుడి భారీగా ఉంది. మరోవైపు, టీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు.

తమ నియోజకవర్గంలో స్థిరపడ్డ ఏపీ మిత్రులతో కలసి సందడి చేయనున్నారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న తలసాని తొలుత విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి భీమవరం చేసుకుని మావూళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. రాత్రికి భీమవరంలోనే బస చేసి, రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా తలసానికి స్వాగతం పలుకుతూ అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి.

talasani
madhavaram krishnarao
bhimavaram
sankrathi
  • Loading...

More Telugu News