karthi: 'దేవ్' నుంచి ఆకట్టుకుంటోన్న ఆడియో ఆల్బమ్

  • తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన 'దేవ్'
  • సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్ 
  • వచ్చేనెల 14వ తేదీన విడుదల    

కార్తీ హీరోగా తమిళం .. తెలుగు .. భాషల్లో 'దేవ్' సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ముందుగా చెప్పిన ప్రకారమే కొంతసేపటి క్రితం ఈ సినిమా తెలుగు ఆల్బమ్ ను విడుదల చేశారు. ఈ ఆల్బమ్ ను షేర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కార్తీ అన్నాడు.

'రేయ్ బావా దేవ్' .. 'షీ ఈజ్ మై గర్ల్'  .. 'ఒక వందసార్లు' .. 'చెలియా' .. 'ఎటో వెళ్లినావే' .. పాటలు ఈ ఆల్బమ్ లో చోటు చేసుకున్నాయి. అన్ని పాటలను చంద్రబోస్ రాయడం విశేషం. 'ఒక వంద సార్లు' .. 'చెలియా' .. 'ఎటో వెళ్లినావే' పాటలు మరింత బాగున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాను వచ్చేనెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. గతంలో 'ఖాకీ' సినిమాతో హిట్ కొట్టిన కార్తీ .. రకుల్, ఈ సినిమాతో మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

  • Loading...

More Telugu News