anushka: అనుష్క హారర్ మూవీలో అంజలి .. షాలినీ పాండే

- మార్చి నుంచి అనుష్క మూవీ
- అమెరికాలో షూటింగ్
- ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు
'భాగమతి' హిట్ తరువాత అనుష్క నుంచి రానున్న సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కథాబలం .. వైవిధ్యం కలిగిన కథలను మాత్రమే ఎంచుకోవాలనే ఉద్దేశంతో అనుష్క కొంత గ్యాప్ తీసుకుంది. ఇటీవలే ఆమె హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారితో కలిసి కోన వెంకట్ నిర్మించే ఈ సినిమాకి, 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
