Hyderabad: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కిన దంపతుల దృష్టి మళ్లించి భారీ చోరీ!

  • హైదరాబాద్ బయలుదేరిన జంట
  • బ్యాగ్ లోని వస్తువుల చోరీ
  • కేసు దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు

సంక్రాంతి పండగ కోసం వెళ్లేందుకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన ఓ జంట దోపిడీకి గురైంది. కాచిగూడ రైల్వే పోలీసుల కథనం ప్రకారం, చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన శ్రీనివాసులు, ఆయన భార్య అంజలి సంక్రాంతి పండగ నిమిత్తం హైదరాబాద్ కు బయలుదేరారు. శనివారం రాత్రి తిరుపతిలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కారు. రైలు పది నిమిషాలు ప్రయాణించి రేణిగుంట వచ్చేసరికి ఆమె బ్యాగులోని 13 గ్రాముల బంగారు, 5 తులాల వెండి ఆభరణాలు, సెల్‌ ఫోన్, ఆధార్‌ కార్డులు, ఏటీఎం కార్డును గుర్తు తెలియని వ్యక్తులు దోచేశారు. ఈ దొంగతనం ఎప్పుడు, ఎలా జరిగిందో తమకు తెలియదంటూ, బాధితులు కాచిగూడ రైల్వే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీన్ని కర్నూల్‌ రైల్వే పోలీసులకు బదిలీచేసినట్లు తెలిపారు.

Hyderabad
Kacheguda
Tirupati
Venkatadri Express
  • Loading...

More Telugu News