Crime News: తన ప్రేమను కాదన్నదన్న కోపంతో యువతి హత్య

  • బలవంతంగా విషం తాగించిన ప్రియుడు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • అనంతపురం జిల్లాలో ఘటన

తన ప్రేమను నిరాకరించిందన్న ఆగ్రహం, తనకు దక్కని ఆమె మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ప్రియురాలినే హత్యచేశాడో యువకుడు. అనంతపురం జిల్లా డి.హిరేహాళ్‌ మండలం నాగులాపురంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

గ్రామానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉన్న ఓ యువతి వెంట ప్రేమ పేరుతో తిరుగుతున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కోపంతో ఆ యువతిని పట్టుకుని ఆమె చేత బలవంతంగా విషం తాగించాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన యువతిని ఆమె బంధువులు హుటాహుటిన బళ్లారిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Crime News
Anantapur District
girl murder
  • Loading...

More Telugu News