Guntur District: బాపట్లలో యువతిని ఎత్తుకెళ్లేందుకు యత్నం... ఇద్దరిని చావగొట్టిన స్థానికులు!

  • కోళ్లపూడి వారి వీధిలో ఘటన
  • ముగ్గేస్తున్న యువతి కిడ్నాప్ నకు యత్నం
  • దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

ఈ తెల్లవారుజామున గుంటూరు జిల్లా బాపట్ల కోళ్లపూడి వారి వీధిలో యువతి కిడ్నాప్ యత్నం తీవ్ర కలకలం రేపింది. తన ఇంటి ముందు ముగ్గు వేస్తున్న యువతి వద్దకు బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. దీన్ని గమనించిన ఆమె సోదరి, గట్టిగా కేకలు వేయడంతో, చుట్టు పక్కల ఉన్న స్థానికులు అప్రమత్తమై వారిని వెంబడించి, యువతిని విడిపించి, దేహశుద్ధి చేశారు.

 ఆపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నిందితులను అరెస్ట్ చేసి తీసుకు వెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆమెకు వారితో గతంలోనే పరిచయం ఉందా? వారిద్దరూ ఎందుకు ఆమెను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Guntur District
Bapatla
Kidnap
  • Loading...

More Telugu News