Kites: కుక్క అరుపుతో భయపడిన యువకుడు... భవనంపై నుంచి పడి మృతి!

  • ఇంటి పైకెక్కి పతంగులు ఎగురవేస్తున్న యువకుడు
  • అరుచుకుంటూ పైకి ఎక్కి వచ్చిన శునకం
  • అదుపుతప్పి కిందపడి తీవ్రగాయంతో మరణం

పతంగుల పండగ ఓ ఇంట తీరని విషాదాన్ని మిగిల్చింది. మిత్రులతో కలిసి బిల్డింగ్ పైకి ఎక్కి గాలిపటాలు ఎగురవేస్తుండగా, అకస్మాత్తుగా పైకి ఎక్కి వచ్చిన ఓ కుక్క, అరవడంతో, తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, హైదరాబాద్, చిలకలగూడలో జరిగిన ఈ ఘటనలో వారాసిగూడకు చెందిన ఇమ్రాన్‌ అలియాస్‌ ఖలీద్‌ (27) తాము అద్దెకు ఉంటున్న ఇంట్లో పైకెక్కి, పతంగులు ఎగురవేస్తున్నాడు.

నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో, ఇంటి యజమానికి చెందిన పెంపుడు కుక్క, పై అంతస్తు నుంచి వినిపిస్తున్న అల్లర్లకు బెదిరి అరుస్తూ, రెండో అంతస్తుపైకి చేరింది. అది ఎక్కడ కరుస్తుందోనన్న కంగారులో ఖలీద్ అదుపు తప్పి భవనం పైనుంచి పడ్డాడు. అతని తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Kites
Hyderabad
Police
Dog
Bark
Died
  • Loading...

More Telugu News