Ramvilas Paswan: సొంత కుమార్తె నుంచే రామ్ విలాస్ పాశ్వాన్ కు నిరసన సెగ!

  • రబ్రీదేవిని నిరక్షరాస్యురాలన్న పాశ్వాన్
  • ప్రస్తుతం ఆర్జేడీలో ఉన్న ఆశా పాశ్వాన్
  • ప్లకార్డులు, బ్యానర్లతో వచ్చి క్షమాపణకు డిమాండ్

లోక్‌ జనశక్తి పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, తన సొంత కుమార్తె నుంచే సెగను ఎదుర్కొంటున్నారు. ఆయన మొదటి భార్య రాజ్‌ కుమారీ దేవీ సంతానమైన ఆశా పాశ్వాన్, తన మద్దతుదారులతో కలిసి వచ్చి నిరసనకు దిగారు. ప్రస్తుతం ఆర్జేడీలో కొనసాగుతున్న ఆమె, మాజీ సీఎం రబ్రీదేవిని నిరక్షరాస్యురాలు అని రామ్ విలాస్ పాశ్వాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, క్షమాపణలు డిమాండ్ చేశారు. బ్యానర్లు పట్టుకొని ఎల్‌జేపీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తక్షణం పాశ్వాన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆశా పాశ్వాన్ వ్యాఖ్యానించారు. కాగా, ఆశా భర్త అనిల్ సాధు, లాలూ ప్రసాద్ తనయుడు తేజ్‌ ప్రతాప్‌ కు సన్నిహితుడు.

Ramvilas Paswan
Asha Paswan
Bihar
RJD
Rabridevi
  • Loading...

More Telugu News