Yadadri Bhuvanagiri District: జగన్ పై దాడి కేసులో ప్రముఖుల పాత్ర ఉన్నట్టు అర్థమవుతోంది: వైవీ సుబ్బారెడ్డి

  • ఎన్ఐఏ దర్యాప్తు చేపడితే బాబుకు ఎందుకు భయం?
  • పెద్దల ప్రోద్బలంతోనే జగన్ పై ఈ దాడి జరిగింది
  • పురందేశ్వరి మా పార్టీలో చేరతామంటే ఆహ్వానిస్తాం

ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే జగన్ పై జరిగిన దాడి కేసులో ప్రముఖుల పాత్ర ఉన్నట్టు అర్థమవుతోందంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేపడితే చంద్రబాబుకు భయమెందుకు అని ప్రశ్నించారు. ఏపీలోని పెద్దల ప్రోద్బలంతోనే జగన్ పై ఈ దాడి జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు.

బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ వీడి వైసీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై ఆయన్ని ప్రశ్నించగా, ఈ విషయం తనకు తెలియదని, చేరతామంటే తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పారు. పోతే, తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మాత్రం ఎట్టి పరిస్థితులలోను తిరిగి చేర్చుకోమని ఆయన చెప్పారు. కాగా, ప్రకాశం జిల్లా పంగులూరు మండలంలోని కల్లమ్ వారిపాలెంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Yadadri Bhuvanagiri District
jagan
YV Subba Reddy
Chandrababu
purandeswari
prakasham
  • Loading...

More Telugu News