nandamuri: సంక్రాంతి వచ్చిందంటే.. గాలి పటాలు గుర్తొస్తాయి: నందమూరి బాలకృష్ణ

  • చిన్నప్పుడు పతంగులు ఎగరవేసేవాళ్లం
  • ఇప్పటికీ సమయం దొరికితే ఎగరవేస్తాం
  • మా నాన్న చాలా బిజీగా ఉండేవాళ్లు
  • మేము కూడా చుట్టపుచూపుగా ఆయన్ని చూడాల్సి వచ్చేది

సంక్రాంతి వచ్చిందంటే.. గాలి పటాలు గుర్తొస్తాయని నందమూరి బాలకృష్ణ తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చిన్నప్పుడే కాదు ఇప్పటికీ తనకు సమయం దొరికితే తమ అన్నదమ్ముల పిల్లలతో కలిసి గాలి పటాలు ఎగరేస్తుంటానని చెప్పారు.

ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన ‘యన్.టి.ఆర్’ తొలి భాగం ‘కథానాయకుడు’ గురించి ఆయన ప్రస్తావిస్తూ, ప్రతి సంక్రాంతికి విడుదలయ్యే తన సినిమా విజయం సాధిస్తుంటుందని, ఈసారి కూడా అలాగే జరిగిందని, ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నానని అన్నారు.

ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో మీ కుటుంబసభ్యులంతా ఈ పండగ ఎలా జరుపుకునేవారన్న ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ, ఆయన చాలా బిజీగా ఉండేవారని, తాము కూడా చుట్టపుచూపుగా తన తండ్రిని చూడాల్సి వచ్చేదని అన్నారు. ఎప్పుడూ ఆయన చుట్టూ జనం ఉండేవారని, ఆయనతో గడిపేందుకు టైమ్ దొరికేది కాదని గుర్తుచేసుకున్నారు.

nandamuri
Balakrishna
NTR
kathanaikudu
  • Loading...

More Telugu News