Tenali: నా జీవితంలో తెనాలికి రావడం ఇదే మొదటిసారి: పవన్ కల్యాణ్

  • ఎంతో అద్భుతంగా నాకు స్వాగతం పలికారు
  • ఈరోజుని ఎప్పటికీ మర్చిపోలేను
  • భవిష్యత్తులో తెనాలి శాటిలైట్ సిటీ కాబోతుంది

తన జీవితంలో తెనాలి రావడం ఇదే మొదటిసారి అని, ఎంతో అద్భుతంగా తనకు స్వాగతం పలికారని, ఈరోజుని ఎప్పటికీ మర్చిపోలేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా తెనాలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పెద్దలు, మహిళలు, రైతులు, యువత, కులాలకు, మతాలకు అతీతంగా తనకు స్వాగతం పలికారని అన్నారు.

ఈ సందర్భంగా ఇక్కడి బకింగ్ హామ్ కెనాల్ గురించి ప్రస్తావించారు. ఈ కెనాల్ ని మన పాలకులు అభివృద్ధి చేయలేదని, అందుకు, స్వార్థ రాజకీయాలే కారణమని విమర్శించారు. జనసేన ఎజెండాలో ఈ కెనాల్ ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. రైతుల కష్టం తనకు తెలుసని చెప్పిన పవన్, ఒకప్పుడు ఎకరా పొలంలో పంట పండించి నష్టపోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. రుణమాఫీ ఇస్తామని వదిలేసే నాయకుల్లాంటి వాడిని తాను కాదని చెప్పారు. భవిష్యత్తులో తెనాలి శాటిలైట్ సిటీ కాబోతుందని అభిప్రాయపడ్డారు.

Tenali
Pawan Kalyan
Jana Sena
nadendla manohar
  • Loading...

More Telugu News