Jagan: ఇలాంటి వ్యక్తి ఏపీకి సీఎంగా ఉండటం చాలా ప్రమాదం: కన్నా ధ్వజం

  • చంద్రబాబు ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకు తెలీదు
  • మానసిక వ్యాధితో బాబు బాధపడుతున్నాడు
  • ఏపీకి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబే

చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో ఆయనకే తెలియట్లేదని, ఇటువంటి మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం చాలా ప్రమాదకరమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ధ్వజమెత్తారు. ఏపీని కేంద్రం ఇచ్చిన నిధులతో చంద్రబాబు అభివృద్ధి చేస్తాడని ఆశిస్తే, తన నలభై సంవత్సరాల అనుభవంతో ప్రతి పైసాను దోచేశారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాను పంచుకున్నారని, జన్మభూమి కమిటీలతో పాటు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు దోచేసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీకి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది, చంద్రబాబునాయుడేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఐదేళ్ల మోదీ పాలన భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని ప్రశంసించారు. మోదీ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో సింహభాగం ఏపీకి ఇచ్చారని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కోసం మోదీ తీసుకున్న చర్యలు ఇంతవరకూ ఎవరూ తీసుకోలేదని కన్నా కొనియాడారు.

Jagan
kanna
Chandrababu
Telugudesam
bjp
YSRCP
  • Loading...

More Telugu News