Chandrababu: జగన్ పై దాడి కేసులో చంద్రబాబు ప్రమేయముంది కనుకనే భయం: కన్నా ఆరోపణలు

  • జగన్ పై దాడి కేసు కేంద్రానికి సంబంధించిందంటారు
  • కేంద్రం ఎంక్వయిరీ చేస్తామంటే బాబుకు భయం
  • ఎన్ఐఏతో ఈ కేసు విచారణకు ఎందుకంటున్నారు!

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కనుకనే ఆయన భయపడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కేసులో ఎన్ఐఏ ఎందుకు కల్పించుకుంటోందని ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ రాశారని విమర్శించారు.

జగన్ పై దాడి జరిగింది ఎయిర్ పోర్టులో కనుక కేంద్రానికే తప్ప తమకేమీ సంబంధం లేదని చంద్రబాబు అన్నారని, ఇప్పుడేమో, కేంద్ర ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తామంటే ఆయన ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారమివ్వనని, ఎన్ఐఏ ఎవరని, ఈ కేసుకు ఎన్ఐఏకు ఏంటి సంబంధమని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. దీనిని బట్టి ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

Chandrababu
Telugudesam
YSRCP
Jagan
kanna
  • Loading...

More Telugu News