Andhra Pradesh: నానీ.. దమ్ముంటే రా.. గుడివాడలోనే తేల్చుకుందాం!: టీడీపీ నేత రావి సవాల్

  • చంద్రబాబుపై కొడాలి వ్యాఖ్యలపై ఆగ్రహం
  • రోజులు లెక్కపెట్టుకోవాల్సింది ఆయనేనని వ్యాఖ్య
  • గుడివాడ ప్రజలు ఓడించబోతున్నారని జోస్యం

వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల కొడాలి నాని ఓ మీడియా సమావేశంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘నాని.. నోరు అదుపులో పెట్టుకో. రోజులు లెక్క పెట్టుకోవాల్సింది నువ్వే. వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడించడానికి గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి రాత్రీపగలు తేడాలేకుండా కష్టపడుతున్న సీఎం చంద్రబాబును నువ్వా విమర్శించేది? దమ్ముంటే రా.. గుడివాడలో తేల్చుకుందాం.’ అని రావి వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. రాష్ట్ర చరిత్రలో అతి దారుణమైన అవినీతి చరిత్ర వైఎస్‌ కుటుంబానిదేనని విమర్శించారు.

Andhra Pradesh
gudiwada
YSRCP
Kodali Nani
Telugudesam
raavi venkateswara rao
  • Loading...

More Telugu News