Andhra Pradesh: నాదెండ్ల యూట్యూబ్ వీడియో హిట్లు.. ‘ఎన్టీఆర్’ సినిమా టికెట్ల అమ్మకాలను మించిపోయాయి!: రాంగోపాల్ వర్మ సెటైర్లు

  • నాదెండ్ల ఎక్కువ ఫేమస్ అయిపోయారని వ్యాఖ్య
  • దేవుడు, ప్రజలు భవిష్యత్ ను అంచనా వేయలేరు
  • ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి 'వెన్నుపోటు', 'ఎందుకు' పేరుతో రెండు పాటలను వర్మ విడుదల చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది. తాజాగా క్రిష్ దర్శకత్వంలో విడుదలైన ‘ఎన్టీఆర్-కథా నాయకుడు’ సినిమాపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా కంటే ఎన్టీఆర్, చంద్రబాబుపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఇచ్చిన ఇంటర్వ్యూకు ఎక్కువ హిట్లు వస్తున్నాయని సెటైర్లు వేశారు.

ఈరోజు వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఓవైపు ఎన్టీఆర్ సినిమాలను ఫేమస్ చేసే ప్రయత్నంలో మేమంతా ఉంటే, నాదెండ్ల భాస్కరరావు అంతకంటే ఎక్కువ ఫేమస్ అయిపోయారు. నాదెండ్ల భాస్కరరావు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకు వస్తున్న హిట్లు, కథానాయకుడు సినిమా కలెక్షన్లను మించిపోతున్నాయి. దేవుడు, ప్రజలు.. ఎవరూ జరగబోయేదాన్ని అంచనా వేయలేరు అనడానికి ఇదే సాక్ష్యం’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Tollywood
ntr
Chandrababu
nadendla
bhaskar rao
kathanayakudu
  • Loading...

More Telugu News